తుపాన్ ధాటికి కూలిపోయిన ఇళ్లు నష్టపరిహారం ఇవ్వాలని వినతి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల సంభవించిన భారీ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వంతర్భ గ్రామంలో సాగెని నాగరాజు, గదేపల్లిలో కొర్రా సన్యాసిరావుకు చెందిన ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. అర్డగూడెం గ్రామంలోని కల్వర్టు వంతెన దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని ఎంపీటీసీ పాంగి రామారావు కోరారు. ఈ నష్టం వివరాలను తహసీల్దార్ మరియు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.