తల్లిదండ్రుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మైక్రోసాఫ్ట్ మాజీ ఉపాధ్యక్షుడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

భారత్లో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులతో గడిపేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగానికి కేశవన్ షణ్ముగం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సుదీర్ఘ కాలం పనిచేసిన ఉద్యోగాన్ని వీడినట్లు ఆయన లింక్డ్ఇన్ వేదికగా వెల్లడించారు. ఎక్సెల్ కోపైలట్ విభాగంలో అద్భుతమైన సహోద్యోగులతో పనిచేసిన అనుభవాన్ని వదిలేయడం కష్టమైనప్పటికీ, తల్లిదండ్రుల సేవలో ఉండటమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ఆయనను ఎంతగానో అభినందిస్తున్నారు.