తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
మురసు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.