బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు మాయ: నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన కామ్రేడ్ కళ్యాణ్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా కామెడీ డ్రామా కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, సాయంత్రం ఆటల నుంచి ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా పెరిగిందని మేకర్స్ స్పష్టం చేశారు. దసరా సెలవలు కూడా కలిసి రావడంతో కేవలం నాలుగు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.