నిరుపేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయ నిధి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన పలువురు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు మేరకు లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందింది. గ్రామ సర్పంచ్ అయితరాజు సరళ లబ్ధిదారులకు చెక్కులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.