'పిల్లలకు విషమిచ్చి నానా తంటాలు పడ్డాడు..': ఖమ్మం జిల్లాలో దారుణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు గడ్డిమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాను తాగి, తన ఇద్దరు పిల్లలు లాస్య, నిఖిల్‌లకు తాగించాడు. ఈ అఘాయిత్యంలో తండ్రీ, కూతురు లాస్య ఇద్దరూ మృతి చెందగా, కుమారుడు నిఖిల్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీనివాసరావు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.