రాజాపేట బడిలో నోరూరించే హర్యానా వంటకాలతో అదరగొట్టిన విద్యార్థులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మంగళవారం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. హర్యానా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వంటకాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.