దేశవాళీ అంపైర్లు మ్యాచ్ రిఫరీల వేతనాలు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో దేశవాళీ అంపైర్లు మరియు మ్యాచ్ రిఫరీల వేతనాలు పెంచుతూ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అలాగే ఐపీఎల్ ఛైర్మన్‌గా అరుణ్ సింగ్ ధూమల్, ఐసీఏ ప్రతినిధిగా ఎం. ఖైరుల్ జమాల్ మజుందార్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో 2027 ఐపీఎల్ 20వ ఎడిషన్‌తో పాటు 2028లో బీసీసీఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని తీర్మానించారు.