మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన: పాల్గొన్న కేంద్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పశ్చిమ గోదావరి

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.