అమెరికాలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్ల పూర్తి నిరసనలు
రిపోర్టర్: సతీష్
స్థలం: World
అమెరికా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రవాస తెలుగుదేశం పార్టీ అభిమానులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గత ప్రభుత్వ కక్షపూరిత పాలనను తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, కూటమి ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.