'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు': రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతూ అధికార వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్ల టీషర్టులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం, పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్షాలపై దాడులకు తెగబడటం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విపక్ష గొంతునొక్కుతూ ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నేతలపై తప్పుడు కేసులు బనాయించడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.