గుంటూరు మున్సిపల్ ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపులపై టీడీపీ కూటమిలో ఉత్కంఠ
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల శిబిరాల్లో అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధత వీడలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని ఆ పార్టీల నాయకులు వెల్లడించారు. మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆశావహులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా అభ్యర్థులకు బి-ఫారాల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో ఎమ్మెల్యేల చుట్టూ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు.