అమెరికా రాజకీయాల్ లో కలకలం: డొనాల్డ్ ట్రంప్ పై అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూయార్క్

అమెరికా రాజకీయాల్ లో బిలియనీర్ల ప్రభావంపై ప్రముఖ నాయకురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ మరియు బిగ్ టెక్ సంస్థల మధ్య సంబంధాలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ పేర్లను బహిరంగంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. శక్తివంతమైన కార్పొరేట్ శక్తులను న్యూయార్క్ అటార్నీ జనరల్ లీటిసియా జేమ్స్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.