'ఆధారాలన్నీ బయటపెడతా..': నందూస్ వరల్డ్ దంపతులపై బాధితుడి సంచలన వీడియో
రిపోర్టర్: రాజేష్
స్థలం: తమిళనాడు
నందూస్ వరల్డ్ వ్యవహారంలో రమానందన, ఆమె భర్త మధుకర్లపై తమిళనాడుకు చెందిన బాధితుడు తీవ్ర ఆరోపణలతో కూడిన సంచలన వీడియోను విడుదల చేశారు. మోసాలు వెలుగులోకి వచ్చిన సమయంలో తప్పించుకోవడానికి రమానందన తన భర్తను రోజంతా టాయిలెట్లోనే దాచిపెట్టారని, వారి అక్రమాల వల్ల తాను ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతం ఇవ్వకుండా, ఎక్స్పీరియన్స్ లెటర్లు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. అవసరమైతే ఆంధ్రాకు వచ్చి అన్ని సాక్ష్యాధారాలను బయటపెడతానని బాధితుడు స్పష్టం చేశారు.