రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల పంపిణీ

రిపోర్టర్: గోపి స్థలం: Vijayawada

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో ఉల్లిపాయల సబ్సిడీ విక్రయాలను ప్రారంభించిన ఆయన, కేంద్రం సహకారంతో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు అర్హులైన కుటుంబాలకు అందజేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రేషన్ దుకాణాలను మీ మార్ట్స్ గా మారుస్తామని తెలిపారు.