ప్రాణదాతలుగా నిలిచిన కమలం నేతల రక్తదానం
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం స్థానిక తోటపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా కార్యక్రమాలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పాండ్రంకి హనుమంతరావు స్వయంగా రక్తదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేల యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ పత్తిపాడు రాజేష్, రాజన్న రవణ తదితరులు పాల్గొన్నారు.