స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం అలాగే శాంతిభద్రతల అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ విజయనగరం (Collector Vizianagaram) ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని కీలక విషయాలను చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రధానంగా సమీక్షించారు.