ఉద్ధానంలో అకాల వర్షాల బీభత్సానికి కుదేలైన జీడి కొబ్బరి రైతులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస ఉద్ధానం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాల కారణంగా జీడి మరియు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీనివల్ల జీవనం సాగిస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి వెంటనే తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.