కడ్తాల్ మండలంలో ఘనంగా ముగిసిన బోనాల ఉత్సవాలు.. సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు!
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సత్యం యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు, ప్రజల సహకారంతో వేడుకలు ప్రశాంతంగా సాగాయన్నారు. ఉత్సవాల విజయానికి కృషి చేసిన గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు, పోలీసు సిబ్బంది, పంచాయతీ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.