మోటకొండూరులో ఘనంగా ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మోటకొండూర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చామల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.