నిరుద్యోగులకు పోలీస్ శాఖ తీపి కబురు: జహీరాబాద్లో ఉచిత శిక్షణ ప్రారంభం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్ఎల్ఆర్ పాఠశాలలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గతంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో ఎంపికైన 265 మంది అభ్యర్థులకు నిపుణులైన అధ్యాపకులతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డీవో, డీఎస్పీ బి.సైదా, ఆర్ఎల్ఆర్ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.లక్ష్మారెడ్డి, సీఐలు రవి, నరసింహా, ఎస్సైలు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.