హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ఎనిమిది హోటళ్ల లైసెన్సులు రద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కోర్ అర్బన్ రీజియన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లలో జరిపిన దాడుల్లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగుచూశాయి. గడువు తీరిన, పాడైన ఆహార పదార్థాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఒక హోటల్‌ను సీజ్ చేయడంతో పాటు ఎనిమిది హోటళ్ల లైసెన్సులు రద్దు చేసినట్లు టీజీసేఫ్ కమిషనర్ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.