సెప్టెంబర్ 25నే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
రాబోయే బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25వ తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లో అడ్వాన్స్‌గా జమ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ శాఖల సిబ్బందికి కూడా ఈ ముందస్తు చెల్లింపులు వర్తిస్తాయని వెల్లడించింది.