తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని నివాళులర్పించిన సైబరాబాద్ పోలీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి మరియు భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల హక్కుల సాధనలో ఆమె చేసిన పోరాటం చరిత్రలో చెరగని ముద్ర వేసిందని Cyberabad Police పేర్కొన్నారు. సామాజిక వివక్ష మరియు దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.