సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సంస్థాన్ నారాయణపూర్
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఎస్ఐ సీత పాండు ముఖ్య అతిథులుగా హాజరై ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైనదని అతిథులు పేర్కొన్నారు. కృష్ణుడి లీలలను స్మరించుకుంటూ యువత ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు బచ్చనగోని గాలయ్య, పలువురు నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.