రాజాపేటలో పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలానికి మంజూరైన పద్నాలుగు కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం లబ్ధిదారులకు ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోలి రవికిరణ్ సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాధాన్యతను వివరించడం జరిగింది.