'జనాభా సంక్షోభం వైపు భారత్': పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై ఆందోళనలు
రిపోర్టర్: సురేష్
స్థలం: భారతదేశం
భారతదేశంలో జననాల సంఖ్య వేగంగా తగ్గుముఖం పట్టడంతో దేశం జనాభా సంక్షోభం వైపు పయనిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 1.9కి పడిపోగా, ఇది స్థిరత్వ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉండటం చారిత్రకంలో ఇదే మొదటిసారి. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో TFR ఎక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 1.4, తెలంగాణలో 1.5, సిక్కింలో దేశంలోనే అత్యల్పంగా 1.0 నమోదైంది. వివాహ వయస్సు పెరగడం, పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి కారణంగా సంతానోత్పత్తి తగ్గుతోందని, ఇది దీర్ఘకాలంలో యువ శ్రామిక శక్తి తగ్గడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.