ఉత్తరాఖండ్ మంత్రి భర్త అరెస్ట్: పరారీలో ఉన్న గిర్ధారి లాల్ సాహు గుర్తింపు

రిపోర్టర్: హరి స్థలం: Dehradun

ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహును ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో పోలీసులు అరెస్టు చేసినట్లు డెహ్రాడూన్ ఎస్ ఎస్ పి ప్రమేంద్ర దోభాల్ వెల్లడించారు. ఫోర్జరీతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సత్యేంద్ర ఠాకూర్ ను ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో అరెస్టు చేశామని, ఇద్దరినీ త్వరలో జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తామని ఎస్ ఎస్ పి మీడియా సమావేశంలో తెలిపారు.