కొవ్వూరు అంధుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: రాజేష్ స్థలం: పశ్చిమ గోదావరి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన దృష్టి ప్రదాత అంధుల పాఠశాల విద్యార్థులు తము నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తనను కలిసినట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ పాఠశాల హాస్టల్ నిర్వహణలో విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల దుస్థితిని స్వయంగా తెలుసుకున్న తాను తగిన సహాయం అందిస్తానని వారికి భరోసా ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.