ఆసియాకప్ సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణి సాయివర్షిని
రిపోర్టర్: వెంకట్
స్థలం: హనుమకొండ
చైనాలో జరగనున్న అండర్-15 ఆసియాకప్ సాఫ్ట్బాల్ పోటీలకు వరంగల్ క్రీడాకారిణి వేల్పుల సాయివర్షిని ఎంపికైంది. అక్టోబర్ 12 నుంచి 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ ఆధ్వర్యంలో సాయివర్షిని నగర పోలీస్ కమిషనర్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల సీపీ ఆమెను అభినందించారు.