రాప్తాడు బాధితురాలికి వైద్యుల సర్జరీ విజయవంతం: మంత్రి నారా లోకేశ్ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: రాప్తాడు

రాప్తాడులో ఉన్మాది దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాలికకు నిర్వహించిన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పరిశీలించారని చెప్పారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, పీఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నామని, బాధితురాలికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.