మాదకద్రవ్యాల కేసులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడి అరైస్ట్ కలకలం

రిపోర్టర్: శివ స్థలం: Kakinada

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సన్నిహితుడు రోకళ్ల సత్యనారాయణ మాదకద్రవ్యాలతో పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి, మూడు రోజుల క్రితం కాకినాడలోని నిందితుడి నివాసంలో డీఆర్ఐ అధికారులు విచారణ జరిపారు. సత్యనారాయణ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడంతో పాటు, ఈ దందా వెనుక అసలు సూత్రధారులపై విస్తృత స్థాయిలో దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు సమాచారం.