కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం: వంద కోట్లతో ఏర్పాటుకు ముమ్మర కసరత్తు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
కాకినాడలో వంద కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ముమ్మరంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ బాబు ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోందని ఆయన తెలిపారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే కోస్తా తీరప్రాంత మత్స్యకారుల భద్రతతో పాటు సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుందని అధికారులు వెల్లడించారు.