మహారాష్ట్రలో అద్భుతం: దసరా వేళ రాత్రంతా బాణసంచా వెలుగుల ఉత్సవం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సాంగ్లీ

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కవఠే ఏకంద్ గ్రామంలో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని స్థానిక ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. గ్రామదైవం శ్రీ సిద్ధరాజ్ మహారాజ్ పల్లకీ ఊరేగింపుతో పాటు రాత్రంతా బాణసంచా కాల్చే అరుదైన సంప్రదాయం ఇక్కడ మూడు వందల ఏళ్లకు పైగా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు.