ఏపీలో జేపీ నడ్డా పర్యటన, పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉండవల్లిలోని నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై ఇరువురు చర్చించారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నడ్డా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో మరో 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.