బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందిన పదమూడేళ్ల బాలిక

రిపోర్టర్: రాము స్థలం: బాలానగర్

హైదరాబాద్‌ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ చౌరస్తా వద్ద యాక్టివాపై వెళ్తున్న పెన్నం శెట్టి నవ్యశ్రీ (13) అనే బాలికను వెనుక నుంచి వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తీవ్రంగా ఢీకొట్టింది. బస్సు టైర్ బాలికపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.