స్వర్ణ పతక విజేతకు దయనీయ స్థితి: స్పోర్ట్స్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా!

రిపోర్టర్: సునీల్ స్థలం: India

జార్ఖండ్‌కు చెందిన గోల్డ్ మెడలిస్ట్ సునీత ఒరాన్ క్రీడా శాఖ కార్యాలయంలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రం కోసం పతకాలు గెలిచిన తనకు, కనీసం జీతం కూడా సకాలంలో అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తనకు శాశ్వత ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు.