కోవూరులో ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో రూ.3.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు ఆధ్యాత్మిక, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.