టాటా మోటార్స్ నుంచి ఆకర్షణీయమైన ఫీచర్లతో సియారా లెజెండ్ ఎడిషన్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ టాటా సియారా లెజెండ్ ఎడిషన్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. కంపెనీ దీని ప్రారంభ ధరను రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించింది. రూ.15 లక్షల లోపు ధరలో కొత్త ఎస్‌యూవీ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం ఈ లెజెండ్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఎడిషన్‌లో అదనపు ఫీచర్లు, స్టైలింగ్ ప్యాక్‌ను జోడించారు.