దేశద్రోహం అంటే విదేశాలకు వెళ్లి దేశ వ్యవస్థలను కించపరచడమే

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను దిగజార్చడమే అసలైన దేశద్రోహమని బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి మన దేశ సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని, ప్రధానమంత్రిని, ఇతర వ్యవస్థలను కించపరచడం రాజద్రోహం కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం ఎవరెవరు దేశద్రోహానికి పాల్పడుతున్నారో గమనిస్తోందని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు.