కాణిపాకంలో అంగరంగ వైభవంగా వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు 21 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. వినాయక చవితి రోజున పుష్పకావళ్లు, గ్రామోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమై, సెప్టెంబర్ 21న రథోత్సవం, సెప్టెంబర్ 22న తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.