రౌడీషీటర్లతో జగన్ ఫొటోలంటూ మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి చేసిన రౌడీషీటర్లు వైకాపా అధినేత జగన్తో ఉన్న ఫొటోలు, వీడియోలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రౌడీషీటర్ల పేర్లను ప్రస్తావిస్తూ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయుల పక్షాన నిలవాలా లేక రౌడీషీటర్ల పక్కన ఉండాలా అని జగన్ను ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.