నేవీ రహస్యాల లీక్ కేసు: పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

భారత నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేసిన కేసులో కాదరి శ్రీనివాస్ను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తున్న సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు బొంగు రవిని అరెస్టు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరపరచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.