ప్రధాని మోదీ జన్మదినం వేళ దీపారాధన నిర్వహించిన గొండు శంకర్

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆశీర్వాద్ కా దియా దీపారాధన నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న నేతలు మోదీ ఆయురారోగ్యాల కోసం, నవ భారత పురోగతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.