జాతీయ రహదారిపై కారు బీభత్సం: వజ్రకొత్తూరు వద్ద ఇద్దరికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వజ్రకొత్తూరు

శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి సిగ్నల్ పోల్ను ఢీకొట్టింది. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దీప్తి సాహూ, దిలీప్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.