నెల్లూరులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్: బ్యాలెట్ బాక్సుల్ లో అభ్యర్థుల భవితవ్యం
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్ లో వర్షం కురిసినా పోలింగ్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల పలు కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తం 128 డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్ లో నిక్షిప్తమైంది.