ఎరువుల కొనుగోళ్లలో తీవ్ర సాంకేతిక సమస్య, ఇబ్బందుల్లో రైతులు

రిపోర్టర్: శివ స్థలం: కాకినాడ

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీబీటీ యాప్‌ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా, డీఏపీ ఎరువుల కొనుగోళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాసి వెనుదిరుగుతున్నారు. ఓటీపీ రాకపోవడం, ఈ-పోస్‌ యంత్రాలు పనిచేయకపోవడంతో డీలర్లు ఎరువులు విక్రయించడం లేదు. సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.