స్థానిక సంస్థల ఎన్నికల వ్యాజ్యాలపై నేడు హైకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
గ్రామ పంచాయతీ అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న అన్ని వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు తీర్పులు ఇవ్వనున్నట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ముందు ఈ కేసులన్నీ విచారణ కోసం జాబితాలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.