దేశవ్యాప్తంగా సెప్టెంబర్ చివరి వారంలో బ్యాంకులు బంద్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో వరుస సెలవులు, సమ్మెల కారణంగా పెద్దఎత్తున సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధనలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది, ముప్పై తేదీల్లో ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు. ఉద్యోగుల సమ్మె దినాలతో పాటు జాతీయ సెలవులు రానుండటంతో ఖాతాదారులు అత్యవసర పనులను ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.