పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలు తయారుచేసిన విద్యార్థులు

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా వికాస్ హై స్కూల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శుక్రవారం విద్యార్థులు స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేసి అభినందించింది. పాఠశాల డైరెక్టర్ కూన వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను కొనియాడారు. మట్టి విగ్రహాల తయారీ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిర్మల మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.